“నీకే భయమూ లేదు
అను! మీ అమ్మా నాన్నా మా అమ్మానాన్నా నీ తోనే ఉంటారు. కాలేజీ పని మీద కచ్చితంగా
హైదరాబాదు వెళ్ళక తప్పడం లేదు. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నా మనసంతా నీ మీదా మహి
మీదా మనకు పుట్టబోయే బిడ్డ మీదే ఉంటుంది. అక్కడ పనవ్వగానే బస్సో రైలో పట్టుకుని నీ
ముందు వాలిపోతాను. ఈ సారి నాకు స్వాగతం కొడుకుతో ఇస్తావో మళ్ళీ కూతురుతో ఇస్తావో..ఎవరైనా
ఒకటే అనుకో”
ఎంతో మురిపెంగా తన
భార్య అనురాధ నిండు గర్భాన్ని ముద్దుపెట్టుకున్నాడు సురేష్.
“అత్తయ్య రేపే
మంచిరోజు అని చెప్పారు సురేష్. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. మహికి నువ్వు
ఊరెళుతున్నావని తెలిస్తే ఇల్లు పీకి...