‘కథలు ఎందుకు రాస్తున్నాను?’ అనే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ‘ఎందుకు చదువుతున్నాను’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. మనకు తెలియని భిన్నమైన జీవిత పార్శ్వాలను తెలుసుకోవడం కోసం, కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా ఆ కథా వాతావరణంలో ఉండడం కోసం, ఆ కథా పాత్రల్లో లీనమవడం కోసం చదువుతుంటాం. నేనూ అందుకే చదువుతుంటాను. నాకు చిన్నప్పటినుంచి నవలలు, కథలు చదివే అలవాటుంది. రెండేళ్ళ క్రితం రాయడం మొదలు పెట్టాను. అప్పటి...