ప్రియాతి ప్రియమైన అమ్మకు,
నీ సుచిత్ర వ్రాయుట. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. నువ్వూ నాన్నా చెల్లీ అన్నయ్యా క్షేమంగా ఉన్నారని తలచుచున్నాను. ఈ నెల ఎనిమిది వేలే పంపుతున్నాను. వచ్చే నెల పదీ పదిహేను వేలు పంపడానికి ప్రయత్నిస్తాను. వసంతక్క ఇక్కడ నాకు చాలా సాయం చేస్తుంది. అప్పుడప్పుడు ఆమె దగ్గరే అప్పు తీసుకుంటున్నాను. చెల్లి ఫీజు కట్టేశారా? నాన్న ఆరోగ్యం ఏమైనా కుదుటపడిందా? అన్నయ్య తాగుడు మానేశాడా లేదా? అన్నయ్యను ఏదోక పనిలో పెట్టించండి. వసంతక్క, బుజ్జక్కల సాయంతో నేను ఎలాగైనా సరే ప్రయత్నం చేసి బయటకొచ్చే సాహసం చేస్తాను. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే నెల్లోనే...