నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

1 Apr 2016

మైదానంలో నేను!

చలాన్ని చదవాలి... మణిరత్నం సినిమా చూడాలి... ఇళయరాజా పాటలు వినాలి... ఒకప్పుడు నా ధ్యాసంతా వాటి మీదే. అదో మైకం. అసలు నా జీవితాన్ని, మరీ ముఖ్యంగా నా వైవాహిక జీవితాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు కాదూ?! స్త్రీ స్వేచ్ఛ అనీ స్త్రీ చైతన్యం అనీ నన్ను అస్తిత్వంలో ముంచెత్తాడు ఒకాయన ఆడపిల్ల అంటేనే ఉత్తేజమనీ ఆకాశపు అంచుల్లో నన్ను విహంగాన్ని చేశాడు ఇంకొకాయన సంగీత పరిజ్ఞానం లేకపోయినా స్వరాలాపనలో మునిగి తేలిపొమ్మని నన్నో రాగమాలికను చేశాడు మరొకాయన! వాళ్ళంతా బానే ఉన్నారు! ఇటొచ్చి నేనే, పెళ్లికి ముందు వరకు వాళ్లు చూపించిన ప్రపంచం కోసం వెతికీ వెతికీ పెళ్లి తరువాత...